శ్రీ చైతన్య సీబీఎస్సీ పాఠశాలను తక్షణమే నిలిపేయాలి : టీజివీపి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధికారిక గుర్తింపు లేకుండా విద్యా వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య సీబీఎస్సీ పాఠశాలను తక్షణమే నిలిపేయాలని టీజీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో అక్రమంగా అడ్మిషన్స్ చేస్తున నిజామాబాద్ శ్రీ చైతన్య సీబీఎస్సీ కరికులం పాఠశాల అడ్మిషన్ ఫార్మ్ ను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేశారు. ఇప్పటివరకు జిల్లా విద్యాధికారి గాని, మండల విద్యాధికారి గాని ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారని తెలిపారు. అనుమతులు లేని స్థితిలో కూడా పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు దురుద్దేశ్యంతో అర్థంలేని...