24 C
Hyderabad
Sunday, August 2, 2026

పది ఫలితాల్లో ఎస్.ఆర్ విద్యార్థుల ప్రభంజనం

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

​ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఎస్సెస్సీ ఫలితాలలో నిజామాబాద్‌లోని ఎస్.ఆర్ విద్యాసంస్థలు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. నగరంలోని ఎస్.ఆర్ పాఠశాలలకు చెందిన బి. సాయిశ్రీ  584/600, కే. పవిత్ర 579/600, యం. ప్రణతి రెడ్డి 579/600, విష్ణు తేజ, 569/600 యం జెస్సింత,569/600 మార్కులు సాధించారు. పదో తరగతి ఫలితాలలో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను ఎస్ ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇంచార్జ్ ప్రణీత్ కుమార్, ప్రిన్సిపాల్ ఇషాక్ అహ్మద్, సరళ, మేరి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ప్రణిత్ కుమార్ మాట్లాడుతూ… ఇద్ధరు విద్యార్ధులకు 580 మార్కులు సాధించగా ,10 మందికి 570, 17 మందికి 560 మార్కులు, 37 మందికి 550 పైచిలుకు, 201 మంది విద్యార్ధులకు 500 పైగా మార్కులు సాధించారన్నారు.​పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.

SR students excel in 10th results
SR students excel in 10th results

More articles

Latest article