27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బతుకమ్మ బాన్సువాడ : ప్రజలు ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పోతంగల్ మండలం సోంపూర్ గ్రామంలో అఖండ శివనామ సప్తహ, మహాదేవ్, శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోంపురు గ్రామం ఆదర్శ గ్రామమన్నారు. గ్రామంలో ఆలయాలు నిర్మించుకుంటే శుభం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, శివాజీ మహారాజ్ విగ్రహ దాత పోచారం సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, పుప్పాల శంకర్, నాగరాజు, చాకురే గంగాధర్ పాల్గొన్నారు.

More articles

Latest article