వెబ్ న్యూస్, బతుకమ్మ: తెలియక పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిన భారత జవాన్ పూర్ణమ్ ను ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల భద్రతా దళాలు చర్చలు ఫలించి చివరకు పాకిస్తాన్ బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ ను భారత్ కు అప్పగించింది. పాక్ కస్టడీ నుంచి విడుదలైన పూర్ణమ్ కుమార్ షా దర్జాగా మాతృ భూమికి తిరిగివచ్చారు. అటారీ బోర్డర్ లో ప్రోటోకాల్ ప్రకారం పాకిస్తాన్ పూర్ణమ్ కుమార్ షాను భారత్ కు అప్పగించింది.
