- డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మురికి కాలువలు అస్తవ్యస్థం
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద మురికి కాలువలు చెత్త చెదారంతో పేరుకుపోయి అస్తవ్యస్థంగా మారాయి. మురికి కాలువల గురుంచి గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మురికి కాలువలు చెత్త చెదారంతో పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని, దోమలు వ్యాప్తి చెంది పలు రోగాల భారిన పడుతున్నామని కలానీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.


