27.5 C
Hyderabad
Friday, July 31, 2026

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సబ్ కలెక్టర్ వికాస్ మహాతో

 

రుద్రూర్, బతుకమ్మ :

 

వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులకు సూచించారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గల ఎంపియుపిఎస్ పాఠశాలను బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థుల గైర్హాజరు తగ్గించేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అదనంగా 3వ తరగతి, 6వ తరగతి విద్యార్థుల మిడ్‌లైన్, ఎండ్‌లైన్ పరీక్ష పత్రాలను పరిశీలించారు. విద్యార్థులు చదవడం, వ్రాయడం నైపుణ్యాలను కూడా అంచనా వేసి, వాటిని మెరుగుపరచడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల మొత్తం ప్రదర్శన సంతృప్తికరంగా లేదన్నారు. ఉపాధ్యాయులు పీరియడ్ ప్లాన్ ప్రకారం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అలాగే టీచర్ సపోర్ట్ గ్రూప్ విద్యార్థులకు అదనపు శ్రద్ధ చూపించి వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ వెంట ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article