హైదరాబాద్, బతుకమ్మ : పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. సుప్రీం కోర్టు తీర్పుకి అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నారు. మొదట 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వీరి నుంచి స్పీకర్ వివరణ తీసుకోనున్నారు. తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నారు.
