Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 12:00 pm Posted by : ramakrishna

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ నోటీసులు

హైదరాబాద్, బతుకమ్మ : పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు.  సుప్రీం కోర్టు తీర్పుకి అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నారు.  మొదట 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.  వీరి నుంచి స్పీకర్ వివరణ తీసుకోనున్నారు. తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు  నోటీసులు జారీ చేయనున్నారు.