28.2 C
Hyderabad

తల్లి జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు వెళ్లి.. హత్యకు గురైన కొడుకు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ లో దారుణం

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తల్లి జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు వెళ్లి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్ గౌడ్ (21) తన తల్లి జన్మదిన వేడుకను స్నేహితులతో కలిసి జరుపుకోవాలనుకున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ వెనుక ఉన్న ప్రాంతంలో వేడుకలు జరుపుకున్నారు. జయంత్ గౌడ్ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఈసమయంలో ముగ్గురు దుండుగులు అక్కడికి చేరుకొని ఆమద్యంబాటిల్ తమకు ఇవ్వాలని జయంత్ గౌడ్ తో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి దుండగులు జయంత్ పై కత్తులతో దాడి చేశారు. హస్పిటల్ కు తరలించగా పరీక్షించిన వైద్యులు జయంత్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.  ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article