- మడిగెల అద్దె విడిసి ఖాతాలోకి
- భవన నిర్మాణం అక్రమమా, సక్రమమా
- అధికారిక విచారణకు జిల్లా న్యాయసేవ సంస్థ ఆదేశాలు
జక్రాన్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో నిర్మించిన ఒక భవనం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధీనంలో ఉన్న విషయంలో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. భవనంలోని ఎనిమిది మడిగెలకు గ్రామపంచాయతీ అధికారిక అనుమతి ఉన్నదా లేదా మడిగెల కిరాయిదారులు నెల వారి అద్దె ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తున్నారా అనే విషయాలు, అసలు భవనానికి గ్రామ పంచాయతీ అనుమతినే నిర్మించారా, భవన స్థలం ప్రభుత్వానిదా ప్రయివేట్ వ్యక్తులదా అనేది తేల్చాలని ఆయన పేర్కొన్నారు. కొన్ని మడిగెలలో వైన్స్ షాప్, పర్మిట్ రూమ్స్ నిర్వహణతో ఎదురవుతున్న సమస్యలు,సదరు భవనం విడిసి అక్రమంగా అదీనంలో ఉన్నదని, అద్దె వారే తీసుకుంటున్నారని,భవన స్థలం ప్రభుత్వానిదేనని జక్రాన్ పల్లి గ్రామస్తుడు ఒకరు పిర్యాదు చేసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్, ఆర్మూర్ అబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు లను జిల్లాకోర్టు ప్రాంగణంలోని సంస్థ కార్యాలయం న్యాయసేవ సదన్ లో జడ్జి ఉదయ్ భాస్కర్ రావు పై పిర్యాదుపై చర్చించారు.పిర్యాదుదారు పిర్యాదులో పేర్కొన్న విదంగా 1982-1987 గ్రామ పంచాయతీ పాలక వర్గం అట్టి స్థలాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ భవన నిర్మాణం కోసం విరాళంగా ఇస్తు చేసిన తీర్మానం, 2020-21 వ సంవత్సరంలో విడిసి అక్రమంగా భవన నిర్మాణం చేసి మడిగెలు కిరాయికి ఇచ్చి, కిరాయి డబ్బులు వారికే చెల్లీస్తున్న విషయాలు తెలిపారు.అబ్ఖారీ శాఖ వైన్స్, పర్మిట్ ఎన్ని రూములకు ఇచ్చింది తదితర అంశాలు వారితో జడ్జి చర్చించారు.పూర్తిస్తాయి విచారణ జరిపి వాస్తవాలు తెల్చాలని, ఒక వేల అక్రమ భవనం అయితే కిరాయిదారులకు నోటీసులు అందజేసి సీజ్ చేయాలని ఆయన ఆదేశించారు.
