జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని మడిగెల మతలబు తేల్చండి
మడిగెల అద్దె విడిసి ఖాతాలోకి భవన నిర్మాణం అక్రమమా, సక్రమమా అధికారిక విచారణకు జిల్లా న్యాయసేవ సంస్థ ఆదేశాలు జక్రాన్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో నిర్మించిన ఒక భవనం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధీనంలో ఉన్న విషయంలో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. భవనంలోని ఎనిమిది మడిగెలకు గ్రామపంచాయతీ అధికారిక అనుమతి...