23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

కులగణనతో సామాజిక న్యాయం

Must read

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ నాయకులు  మల్యాల గోవర్ధన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  కుల గణనతో సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు మాల్యాల గోవర్దన్ అన్నారు.  తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమంలో నిజామాబాద్ నగరంలోని 14వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ఎన్యుమేటర్ జయశ్రీ తో కలిసి కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ అణగారిన వర్గాలు ఈ దేశాన్ని ఏలే విధంగా మా రోజులు మాకు రావాలని ఎంతోకాలంగా ఉన్న చిరు స్వప్నాన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుల గణన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమ వివరాలను అందజేస్తుంటే, ప్రతిపక్ష నాయకులకు ఈసడింపుగా ఉందని, ఎద్దేవా చేశారు, రాజ్యాంగఫలాలు కులాల వారీగా ఎవరి వాటా వారికి దక్కే అవకాశం ఉందని ప్రజలు మరింతగా ఇండ్ల వద్దకు వచ్చే సిబ్బందికి సహకరించాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article