27.8 C
Hyderabad

నందిపేట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్ ఆడిట్

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ జెడ్పీహెచ్‌ఎస్‌ ఉర్దూ మీడియం పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా పరిశీలకురాలు మమత గురువారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అదే విధంగా జెడ్పీహెచ్‌ఎస్‌ నందిపేట్‌లో స్టేట్ టీమ్ సభ్యులు నూతన్, బిందు సోషల్ ఆడిట్ నిర్వహించారు. పరీక్షల విభాగం, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, స్పోర్ట్స్ రూమ్, గ్రంథాలయం, అలాగే పాఠశాల ఆదాయ–వ్యయ లెక్కలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణా లు, మౌలిక వసతుల పరిస్థితిపై వివరాలను సేకరించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరించారు. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి సోషల్ ఆడిట్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. కృష్ణాజీ, ఉపాధ్యాయ బృందం, నందిపేట్ గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రజిత, వార్డు మెంబర్ సలీం, నీలోఫర్ మసీదు కమిటీ అధ్యక్షులు సయ్యద్ కలం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article