నందిపేట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్ ఆడిట్
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ జెడ్పీహెచ్‌ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా పరిశీలకురాలు మమత గురువారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అదే విధంగా జెడ్పీహెచ్‌ఎస్ నందిపేట్‌లో స్టేట్ టీమ్ సభ్యులు నూతన్, బిందు సోషల్ ఆడిట్ నిర్వహించారు. పరీక్షల విభాగం, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, స్పోర్ట్స్ రూమ్, గ్రంథాలయం, అలాగే పాఠశాల ఆదాయ–వ్యయ లెక్కలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో...