27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాలో ఇప్పటి వరకు 5.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రైతులకు ఇప్పటి వరకు రూ.1025 కోట్ల చెల్లింపులు

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

జిల్లాలో ధాన్యం సేకరణ, రవాణా, రైతులకు ధాన్యం తాలుకా చెల్లింపులపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ పత్రిక ప్రకటన విడుదల చేశారు.. జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం…జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం మొత్తం 4 లక్షల 23 వేల ఎకరాల్లో వరి సాగు చేయబడింది. ఇందులో సన్నలు, దొడ్లు కలిపి సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయబడింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం 9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో మొత్తం 739 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 629 కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని 33 మండలాల్లో ఐకేపీ, పాక్స్ మెప్మా ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభించబడింది. సాధారణంగా 60 రోజుల్లో పూర్తయ్యే కొనుగోలు ప్రక్రియను ఈసారి 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అందులో భాగంగా మే 10వ తేదీ నాటికి 5 లక్షల 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబడింది. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం సుమారు 1 లక్ష 90 వేల మెట్రిక్ టన్నులు ఉన్నప్పటికీ, సన్న రకం ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయడం వల్ల మొత్తం ధాన్యం రాక తగ్గే అవకాశముంది. ప్రస్తుతం మొత్తం 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు అవుతుందని అంచనా వేస్తున్నాము. రాబోయే 20 రోజుల్లో మరో లక్ష నుండి 1.75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయనున్నాము. జిల్లాలోని బోధన్ డివిజన్‌లో అన్ని కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే మూసివేయబడగా, నిజామాబాద్ డివిజన్‌లో నందిపేట్ మండలంలో 80 శాతం, నవీపేట్‌లో 60 శాతం, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో 80 శాతం వరకు ధాన్యం సేకరణ పూర్తయింది. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఎక్కువ మొత్తంలో ధాన్యం ఉండటంతో అక్కడ 50 నుండి 60 శాతం వరకు ధాన్యం సేకరించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాము. ప్రస్తుతం అధిక ఎండల కారణంగా కార్మికుల కొరత, రవాణా సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నాము. జిల్లా కలెక్టర్, సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాల మేరకు మరో 20 రోజుల్లో మొత్తం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. రైతుల నుండి అందుతున్న ప్రతి వినతి, ఫిర్యాదును వెంటనే పరిశీలించి పరిష్కరిస్తున్నాము. ముఖ్యంగా కడ్త సమస్యలు ఎక్కడైనా మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాము. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో కూడా ఈ అంశంపై చర్చించి, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాము. వారు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని మిల్లర్లను ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ప్రతి రోజు 700 నుండి 800 వాహనాలు లోడింగ్ అవుతుండగా, సుమారు 500 వాహనాలు అన్‌లోడింగ్ అవుతున్నాయి.

 

So far, 5.10 lakh metric tons of grain have been procured in the district.

 

దొడ్డు రకం ధాన్యాన్ని కేవలం బాయిల్డ్ మిల్లర్లకు మాత్రమే కేటాయిస్తున్నాము. జిల్లాలో మొత్తం 53 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా, దొడ్డు ధాన్యం సుమారు 90 వేల నుండి 93 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 35 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేయబడింది. మిగిలిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నాము.ఇప్పటి వరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సరిపడా గోనె సంచులు అన్ని కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయబడినాయి. అలాగే రైతులకు ఇప్పటి వరకు రూ.1025 కోట్ల మేర చెల్లింపులు జరిపినాము. జిల్లా పాలనాధికారి, జిల్లా అదనపు పాలనాధికారి, సబ్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ, డీసీఓ, పీడీ డీఆర్‌డీఏ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, రోజువారీ సమీక్షలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, కొనుగోలు సజావుగా వేగవంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

 

So far, 5.10 lakh metric tons of grain have been procured in the district.

More articles

Latest article