23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆరో టౌన్ కోర్టు కానిస్టేబుల్  సస్పెండ్

Must read

📰 Generate e-Paper Clip

ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ ను సస్పెండ్ చేస్తూ సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆరో పోలీస్ స్టేషన్ నుంచి గజానంద్ జాదవ్ జిల్లా కోర్టు లో  విధులు నిర్వహిస్తున్నారు.  కోర్టు లో వివిధ నేరాలకు సంబంధించిన క్రైమ్ తాత్కాలిక ప్రాపర్టీ రిలీజ్ కేసులలో పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరించి, వివిధ కేసులలో అవినీతికి పాల్పడుతున్నట్టు  అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అలాగే గజానంద్ జాదవ్ పలు ప్రయివేటు చీటీల యాజమాన్యం సహకారంతో కలిసి 4 నుంచి 5 చీటీలు వేసి తన తోటి సిబ్బంది, మిత్రులను మోసం చేసిన ఘటనలో  నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈవిషయం సీపీ దృష్టికి రావడంతో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు  జారీచేశారు.

More articles

Latest article