నెల రోజులు గడిచిన ధాన్యం కొనుగోళ్లు లేవు
. . . మాచారెడ్డి లో రహదారిపై రైతుల ఆందోళన
మాచారెడ్డి, బతుకమ్మ:
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొని నెల రోజులు గడిచింది. అధికారులు లేరు.. పాలకులు పట్టించుకోరు.. చెడగొట్టు వాన పడితే పరిస్థితి దారుణం.. ధాన్యం కొనుగోలు జరపడం లేదని కామారెడ్డి జిల్లాలో అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కామారెడ్డి- సిరిసిల్ల రహదారిని దిగ్బంధించారు. మాచారెడ్డి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. దానితో రహదారికి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రైతులను సముదాయించే యత్నం చేసిన వెనక్కి తగ్గలేదు. అధికారులు వచ్చి ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేస్తేనే ఆందోళన విరమించుతామని భీష్మించుకు కూర్చున్నారు.

