29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

భీమ్ గల్ లో ‘సిందూర్’ విజయోత్సవ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసేందుకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను హర్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భీమ్ గల్ లో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణం లోని బస్ స్టాండ్ వద్ద భారత్ మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు.

పార్టీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు మాట్లాడుతూ.. ఇకముందు యుద్ధమే చేయాల్సి వస్తే ప్రతి ఒక్క భారత పౌరుడు ఒక జవాన్ లాగా మారి దేశానికి అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, బండారి లక్ష్మణ్ గౌడ్, సంధ్యారాజు, పతాని ప్రవీణ్, అంజి, హరిప్రసాద్, నవీన్, అజయ్, గణ ఈశ్వర్ సాయి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article