భీమ్ గల్ లో ‘సిందూర్’ విజయోత్సవ సంబరాలు
భీమ్ గల్, బతుకమ్మ : పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసేందుకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను హర్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భీమ్ గల్ లో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణం లోని బస్ స్టాండ్ వద్ద భారత్ మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు మాట్లాడుతూ.. ఇకముందు యుద్ధమే చేయాల్సి వస్తే ప్రతి ఒక్క భారత పౌరుడు ఒక జవాన్ లాగా మారి దేశానికి అండగా నిలుస్తామన్నారు....