. . . బతుకమ్మ పత్రికకు శుభాకాంక్షలు
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం బతుకమ్మ పత్రిక క్యాలెండర్ ను సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, ఎంపీడీవో అనంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ లు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న సమస్యలను నిర్భయంగా బతుకమ్మ పేపర్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వాటిని వెంటనే పరిష్కరించే మార్గం చూస్తామన్నారు. అనంతరం బతుకమ్మ పత్రికకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పత్రిక అంటేనే ఎలాంటి రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా నిజాలను నిర్భయంగా రాస్తూ అతీత కాలంలోనే అనేకమంది పాఠకులను సొంతం చేసుకుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు,ఉపాధి హామీ సిబ్బంది, బతుకమ్మ విలేఖరి జెగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.
