27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

శక్తి నగర్ పాఠశాలకు ఎస్ హెచ్ విఆర్ అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మారుమూల గ్రామమైన శక్తి నగర్ పాఠశాలకు ఎస్ హెచ్ వి ఆర్ అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి కృషి వల్లనే ఇది సాధ్యమైందని మారుమూల గ్రామంలోని పాఠశాలకు ఎస్ హెచ్ వి ఆర్ అవార్డు తీసుకురావడం ఆనందించదగ్గ విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం పరుస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు ఎస్ హెచ్ వి ఆర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇది భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో స్వచ్ఛత, పర్యావరణ సుస్థిరత, పరిశుభ్రత, హరిత పద్ధతులు మరియు పర్యావరణ బాధ్యతలను ప్రోత్సహించే ఒక జాతీయ కార్యక్రమం  స్వచ్ఛమైన, సుస్థిరమైన విద్యా వాతావరణాన్ని సృష్టించిన పాఠశాలకు ఈ అవార్డు ద్వారా గుర్తింపు లభిస్తుంది. అని ఆమె తెలియజేశారు.

More articles

Latest article