బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ కాలనీలోని విశ్వకర్మ భవన్ లో సోమవారం శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ధ్వజారోహణ, విశ్వకర్మ పూజ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీసీఎస్ నాగేంద్ర చారి, పట్టణ విశ్వకర్మ సంఘం వ్యవస్థాపకులు రామదాసు చారి, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, పట్టణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ చారి తదితరులు పాల్గొన్నారు.
