బతుకమ్మ, ఆర్మూర్ : హైదరాబాదులోని, తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో, తన తోటి న్యాయశాస్త్ర విద్యార్థి, ఆత్మీయ మిత్రుడు, ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డిని కలిసి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండంట్ సుందర్ అభినందనలు తెలియజేశారు.
తన ఆత్మీయ మిత్రుడు, క్లాస్మేట్ రాష్ట్రంలోని విద్యా సంబంధిత శాఖలో ఒక ఉన్నత పదవిని పొందినందుకు సుందర్ సంతోషం వ్యక్తం చేశారు. వారి విద్యార్థి దశను ఒకరికొకరు కాసేపు ముచ్చటించుకున్నారు. అలాగే విద్యావ్యవస్థ లో వస్తున్న అపూర్వ మార్పుల పై మరియు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ – 2020 గురించి వివరంగా చర్చించుకున్నారు. విద్యతో పాటు విద్యార్థులకు ఆరోగ్య ప్రాముఖ్యత పై అవగాహన పెంచాల్సిన అవసరం చాలా ఉందని ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి సూచించారు. అలాగే నూతన విద్యా విధానం కు అనుగుణంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ పై నూతన విద్య ఒరవడులతో శ్రీ భాషిత పాఠశాల, విద్యార్థులకు ఎలా అందిస్తుందో కరస్పాండెంట్ సుందర్ వివరించారు. శ్రీ భాషిత పాఠశాలలో ఉపాధ్యాయులకు అవసరాలకు అనుకునంగా ప్రత్యేకమైన శిక్షణను అందించి, ఉపాధ్యాయులే భావి తరాలకు బలమైన పునాదులు నిర్మించే వారని గుర్తుచేస్తున్నామని సుందర్ తెలియజేసారు. అంతేకాకుండా రోబోటిక్స్ ల్యాబ్ ల ద్వారా నూతన టెక్నాలజీ పరంగా మరియు సైన్స్ వంటి ప్రాజెక్టు వర్క్ వల్ల విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత బయటకు తీయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు మోటివేషన్ తరగతుల ద్వారా వారు అనుకున్న గమ్యం నిర్ణయించుకొనే సత్తా అది చేరుకునే సాధనాలు ఎలా సమకూర్చుకోవాలో అనేది కూడా పాఠశాలలో వివరించడం జరుగుతుందని అని వివరించారు. పాఠశాల ప్రణాళికలు మరియు విద్యాభివృద్ధిలో శ్రీ భాషిత కృషిని ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ బాలకిస్టారెడ్డి ప్రశంసించారు. అలాగే, శ్రీ భాషిత సామాజిక బాధ్యతల్లో తమవంతు కృషి చేయాలని తన స్నేహితుణ్ణి పురామయించారు.
Next Post