29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్తీక మాస దీక్షలోకి శ్రీబాలయోగి కృష్ణ మహారాజ్ 

Must read

📰 Generate e-Paper Clip

  • 21 రోజుల కఠిన దీక్ష 
  • నవంబర్ 15న దీక్ష విరమణ 
  •  16న  కందకుర్తీ త్రివేణి సంఘమాని పాదయాత్ర

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ  : నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం సంస్థపకులు శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ శుక్రవారం కార్తీక మాస దీక్షలోకి వెళ్లారు. ప్రతి యేటా అశ్వయుజ నవమి నుండి 21 రోజుల పాటు అన్న, ఆహారాదులు మాని లోకాకల్యాణర్థం ఈ దీక్షను స్వామి చెప్పడతారు. ఈ కార్తీక దీక్ష ను ఈ నెల 25న ప్రారంభించి వచ్చే నవంబర్ 15న స్వామి వారు దీక్షను విరామిస్తారు. విరమించిన మరుసటి రోజు 16న మల్లారం ఆశ్రమం నుండి కందకూర్తి త్రివేణి సంఘమం వరకు పాదయాత్ర ను నిర్వహిస్తారు. దీక్షకు వెళ్తున్న స్వామి వారి కటాక్షాన్ని పొందెందుకు వేలాది మంది భక్తులు ఆశ్రమానికి వచ్చారు. స్వామి భక్తులకు ఈ కార్తీక దీక్షలో భాగంగా మధ్యలో ఈ నెల 31 న అమావాస్య గురువారం రోజు అర్ధరాత్రి 12.05నిముషాలకు దర్శనమిచ్చి తిరిగి దీక్షలోకి వెళ్తారు. మల్లి విరమణ రోజైన నవంబర్ 15 శుక్రవారం భక్తులకు తిరిగి దర్శనం ఇచ్చి దీక్షను విరామిస్తారు.

More articles

Latest article