- ఆపద్బాంధవుడిగా గణిత ఉపాధ్యాయుడు
బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో చాలా ఉన్నత పాఠశాల్లలో గణిత ఉపాధ్యాయుల కొరత ఉంది. గణిత ఉపాద్యాయుల కొరతను తీర్చడానికి శేఖ్ అహ్మద్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు. కాగా ఇతను ఇప్పటి వరకు తన 14 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 80 శాతం సమయం విషయ నిపుణుల కొరతగల ఉన్నత పాఠశాల్లో భోదించడానికే వెచ్చించారు. అయితే ఇందులో 4 సంవత్సరాలు రెగ్యులర్ నియమిత ఉపాధ్యాయునిగా బోధిస్తే 5 సంవత్సరాలు సర్దుబాటుపై ఉన్నత పాఠశాలల్లో బోధించడం విశేషం. అంతేగాకుండా గణితశాస్త్రంలో పట్టు బిగించిన ఈ ఉపాధ్యాయుడు సబ్జెక్టు కొరతను ఎదుర్కొని సమయానుసారంగా వివిధ సందర్భాలలో జీవశాస్త్రం, తెలుగు, ఆంగ్లం, భౌతిక శాస్త్రం పాఠాలను సైతం బోధించడం జరుగుతుంది. గణిత శాస్త్రమును తెలుగు, ఉర్దూ, ఆంగ్లం లలో బోధించడం విశేషం. ఈయన బోధించిన అనేక సందర్భాల్లో 90 శాతం 100 శాతం ఫలితాలు సాధించడం గమనార్హం. సదరు ఈ ఉపాధ్యాయుడికి మండల ప్రజలతో పాటు తోటి ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.