26.2 C
Hyderabad
Monday, August 3, 2026

షాప్ లైసెన్స్ ఒకరిది అమ్మేది మరొకరు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : నాలుగు ఎకరాలలో సిరి రైడర్ కంపెనీ సంబంధించిన మొక్కజొన్న గింజలను శ్రీనివాస ఫర్టిలైజర్స్ షాప్ లో తీసుకొని వేస్తే మొక్కజొన్న పెరగలేదని రైతు వంకేడి నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తిప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు వాంకిడి నర్సారెడ్డి మాట్లాడుతూ నాలుగు ఎకరాల భూమిలో శ్రీనివాస ఫర్టిలైజర్ షాపులో సిరి రైడర్స్ మొక్కజొన్నలు 12 వేల రూపాయలు పెట్టి  తీసుకోవచ్చామని, మొక్కజొన్న సరిగా మొలువ లేదని ఆవేదన వ్యక్తం

Shop license is sold by one person

చేశారు. ఇదే విషయంపైన శ్రీనివాస్ ఫర్టిలైజర్ షాప్ యజమాని విజయ్ కుమార్ ను అడగగా నా దగ్గర తీసుకున్నది వాస్తవమేనని కానీ అతను వేసిన టైం లో వర్షం పడిందని అందుకు నేనేం చేయాలని అంటూ బదులు చెప్తున్నాడని తెలిపారు. ఏదైనా ఉంటే రైతు సిరి రైడర్స్ షాపులో అడగాలి కానీ అందుకు నేనేం చేయాలని అనడం కొస మెరుపు. అగ్రికల్చర్ అధికారులు తరచు తనిఖీలు చేయకపోవడం ద్వారానే రైతులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నకిలీ మొక్కజొన్నలు అమ్ముతున్న వారి పైన చర్యలు తీసుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Shop license is sold by one person

More articles

Latest article