33.2 C
Hyderabad

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్, బతుకమ్మ  :

 

లింగంపేట్ మండలం శెట్ పల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కందూరి సాయన్న (70) శుక్రవారం ఉదయం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఎండలు తీవ్రంగా ఉండడంతో వడ దెబ్బతాకినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అటవీ ప్రాంతం నుండి ఇంటికి వచ్చిన కొద్ది సమయంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటామని సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మృతుని ఇంటికి వెళ్లిన వైద్య సిబ్బంది ఏఎన్ఎం రాధిక, ఆశా వర్కర్ మంజుల, జిపిఓ ఆశమ్ అలీ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించారు.

More articles

Latest article