- సందిగ్ధంలో ఓఅండ్ఎం సిబ్బంది
- 5 న జాబితా ఆగడంతో సందేహాలు
- నేడు ప్రకటన : ఎస్ ఈ
నిజామాబాద్, బతుకమ్మ: ఐదవ తేదీన జాబితా వెలువడకపోవడంతో డిచ్ పల్లి డివిజన్ కు పోతామా… లేదా అనే సందిగ్ధంలో ఓఅండ్ఎం సిబ్బంది ఉన్నారు. డిచ్ పల్లి డివిజన్ కు కావాల్సిన ఉద్యోగుల కేటాయింపు నిమిత్తం ఆదివారం (5 వ తేది) వెలువరించాల్సిన జాబితా రాకపోవడంతో ఆప్షన్స్ ఇచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ప్రకటిస్తారా .. లేదా ..? అని, తమ సంఘ నాయకులకు ఫోన్లు చేసి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. డిసెంబర్ 23న సాయంత్రం నిజామాబాద్ ఎస్ ఈ రవీందర్ ఆప్షన్స్ కోసం ప్రకటనను జారి చేసారు. అదే నెల 31 వరకు సంబంధిత డిఈఈకి ఆప్షన్స్ దరఖాస్తులను ఇవ్వాలని చెప్పారు. వీటిని స్క్రుటిని చేసి ఈ నెల 5 న జాబితా ప్రకటించి 10 న బదిలీ ఉత్తర్వులను ఇస్తామని ఎస్ ఈ వెల్లడించారు. సమయానుకూలంగా జాబితా వెలువడకపోవడంతో డిచ్ పల్లి డివిజన్ కు వెళ్లేందుకు ఉత్సుకతను చూపుతున్నవారు అయోమయంలో పడ్డారు.
- జాబితాపై సందేహాలు:
డివిజన్ ఏర్పాటుపై మొదటి నుంచి అంతరాయాలు ఏర్పడుతున్నాయి. 2022 లో డివిజన్ ను పూర్తి స్థాయిలో నెలకొల్పాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఒక సంఘ నాయకుని వల్ల పవర్ హౌస్ కే పరిమితం చేసారు. మల్లి తెర మీదకు రావడంతో ఉద్యోగ సంఘ నాయకులు అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేసారు. ఎలాగోలా ఎస్ఈ ప్రకటనను జారీ చేయగా, అనుకున్న ప్రకారమే విభజన ప్రక్రియ జరుగుతుందని భావించారు. ఆప్షన్స్ ఇవ్వడం పూర్తి అయ్యాక జాబితా ప్రకటన కోసం కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకొని చూసారు. జాబితా కనబడక పోయేసరికి సిబ్బంది మోముల్లో ఆందోళన మొదలైంది.
- సోమవారం ప్రకటన : ఎస్ ఈ
విభజనకు సంబందించిన జాబితాను నేడు 6 వ తేదీన ప్రకటిస్తామని ఎస్ ఈ రవీందర్ తెలిపారు.
