ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవ పక్షం మండల కార్యశాల కార్యక్రమంను మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం పురస్కరించుకొని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఉంటుందని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి బూత్ స్థాయి లో కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీ గెలుపే దిశగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి,జిల్లా ఐటీ సెల్ ప్రకాష్, సేవ పక్షం కన్వీనర్ కృష్ణ హరి,కో కన్వీనర్ గంట బాలకృష్ణ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్, నంది నరేష్, ఉపాధ్యక్షులు శ్యాగ లక్ష్మణ్, మల్లారం మహేష్, సీనియర్ నాయకులు రావుల గాల్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి,పిట్ల శ్రీశైలం,మాలోత్ కిరణ్ నాయక్,మానుక కుమార్, రవీందర్,రంజిత్, శ్రీకాంత్ రెడ్డి, బుర్కా వేణు,పరశురాం రెడ్డి గణేష్ నాయక్,దండు నవీన్, అబ్దుల్, నరసయ్య,మహేందర్, రాకేష్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

