బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో సేవ పక్షం మండల కార్యశాల కార్యక్రమం
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవ పక్షం మండల కార్యశాల కార్యక్రమంను మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం పురస్కరించుకొని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఉంటుందని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న...