కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో సెర్ప్, డిఆర్డిఏ సిబ్బంది బదిలీలు ప్రక్రియ లో భాగంగా మంగళవారం నిజామాబాద్ నుండి ఇద్దరు డిపిఎంలు శ్రీనివాస్, సాయిలు, నిర్మల్ జిల్లా నుండి వచ్చిన శోభారాణి, సిద్దిపేట జిల్లా నుండి వచ్చిన రాజయ్య, కామారెడ్డి జిల్లాలో ఇదివరకు పనిచేస్తున్న సురేష్ కుమార్ లు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన డిపిఎంలు అన్ని అంశాల్లో మోడల్ గా ఉండాలని, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ, జిల్లా సమైక్య ప్రతినిధులు, ఏపీఎంలు, స్త్రీ నిధి సిబ్బంది, జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు.