27.2 C
Hyderabad

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కు సెయింట్ జాన్స్ విద్యార్థుల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మాచారెడ్డి మండలంలోని సెయింట్ జాన్ స్కూల్ లో  ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎంపికయ్యారు. గుగులోత్ అక్షర,  గుగులోత్ అక్షిత్ అనే విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలో  మొదటి విజేతగా నిలిచారు. రాష్ట్రస్థాయిలో జనవరి 5వ తేదీన నిర్వహించే పోటీల కు ఎంపికవడంపట్ల పాఠశాల కరస్పాండెంట్ పి. శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.  పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు 300 మీటర్ రన్నింగ్ లో అక్షర అండర్ 10, అండర్ 8 విభాగం జావాలింగ్ త్రో లో గూగుల్ అక్షిత్  రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.  విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్,  సిబ్బంది వారిని అభినందించారు.

More articles

Latest article