24.8 C
Hyderabad
Friday, July 31, 2026

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ కమ్మర్ పల్లీ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, ఈజీఎస్ ఎపిఓ విద్యానంద్, స్థానిక పంచాయతీ కార్యదర్శి గంగా జమున, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, ఊట్నూరి ప్రదీప్, సుంకేట శ్రీనివాస్, నరసయ్య, అజారోద్దీన్, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article