25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కళాకారులు సద్వినియోగం చేసుకోవాలి

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపిక నూతన కళాకారులకు గొప్ప అవకాశం అని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని  నూరేండ్ల నాఊరు కళానేతలు అష్ట గంగాధర్, రెలారే గంగా, నరాల సుధాకర్ అన్నారు. శనివారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ..ప్రముఖ ప్రజా కవి, గాయకులు వరంగల్ శ్రీనివాస్ రచించిన నూరేండ్ల నా ఊరు గేయకావ్యం ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపిక కార్యక్రమం డిసెంబర్ 30 న సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఆసక్తి ఉన్న గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని  ప్రతిభతో ఈ గేయ కావ్యంలో పాడే అవకాశాన్ని దక్కించుకోవాలన్నారు. 243 చరణాలు కలిగిన ఈ గేయకావ్యంలో 243 మంది ప్రతిభావంతులైన గాయనీ గాయకులచే పాడించాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నూరేండ్ల నాఊరు కళానేతలు అష్ట గంగాధర్, రెలారే గంగా, నరాల సుధాకర్, రాంపూర్ సాయి, సాయి లవోల, కర్క రమేష్ (వాడి), లక్క క్రాంతి, సవిత,దివ్య , మహేందర్, సంతోష్, లు పాల్గొన్నారు.

Selection of singers for Oyamma Na Palleseema

More articles

Latest article