నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్స్ విభాగంలో స్క్రిప్ట్ టు స్క్రీన్ : ఎలక్ట్రానిక్ మీడియా అనే అంశంపై మూడు రోజుల పాటు కార్యశాల నిర్వహించనున్నట్లు మాస్ కమ్యూనికేషన్ విభాగ అధిపతి ఆచార్య చంద్ర శేఖర్ తెలిపారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల కార్యా చరణ లో భాగంగా చేపట్టిన కార్యశాల బ్రోచర్ ను వర్సిటీ వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ సంపత్ కుమార్, మాస్ కమ్యూనికేషన్ బీవోఎస్ డా. శాంతాబాయి, డా.మోహన్, డా. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.