25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీడి కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతన నిమిత్తం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని కార్మిక వైద్య శాల సీనియర్ ఫార్మాసిస్ట్ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ,విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు 1,000 రూపాయలు,5 నుంచి 8 వరకు 1,500, 9 నుంచి 10 వరకు 2,000,ఇంటర్ వరకు 3,000,డిగ్రీ, ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు 6,000,బీటెక్, బీఏఎంఎస్, తదితర కోర్సులకు 25,000 రూపాయలు ఉపకార వేతనం లభిస్తుందని తెలిపారు. బీడీ పరిశ్రమలో పనిచే స్తున్న వారి పిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు కేంద్ర ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ఉపకార వేతనాలను అందిస్తోందని తెలిపారు.ఫ్రీ మెట్రిక్ ఒకటి నుండి పదవ తరగతి చదివే వారికి 31- 8 – 2025 వరకు, పోస్ట్ మెట్రిక్ 10 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారికి 31- 10 – 2025 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ పోర్టల్ Scholarship.gov.in/Application form. @nsp.gov.in Help line No! 0120-66195405 040 29561297 కు సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం 2025-26 విద్యాసంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఆయన పేర్కొన్నారు.విద్యార్థి తల్లి లేదా తండ్రికి పీఎఫ్ ఐడీ కార్డు ,విద్యార్థి పేరిట బ్యాంకు ఖాతా,గత సంవత్సరం చదివి, పాసైన మార్కుల మెమో,2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం,కుటుంబ ఆదాయం నెలకు రూ. 10 వేల లోపు ఉన్న సర్టిఫికెట్ ను https://scholarship.gov.in వెబ్ సైట్లో సంబంధిత వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు, దూరవిద్య అభ్యసించిన వారు అనర్హులు అని తెలిపారు.

Scholarship application for children of beedi workers

More articles

Latest article