నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దుబ్బా గవర్నమెంట్ హై స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జె.గంగయ్య మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సంఘాల నేతలు ఆయనను ఘనంగా సన్మానించారు. గంగయ్య చేసిన సేవలను గుర్తు చేసుకుని ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జె.గంగయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లమారి మల్లికార్జున్, జిల్లా కమిటీ సభ్యులు శీబా, పద్మావతి, ప్రమోదిత పాల్గొన్నారు.