. . . ఏఎస్పీ చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేసిన దళితులు
కామారెడ్డి, బతుకమ్మ:
శ్రీరామ నవమి ఉత్సవాలలో దళితులను అవమానించి, ఆంక్షలను విధించిన రత్నగిరి పల్లి విడిసీపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఎస్పి చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేసిన రత్నగిరి పల్లి గ్రామ దళితులు అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సంధర్బంగా దళితులు మాట్లాడుతూ… కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని రత్నగిరిపల్లి గ్రామంలో మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామ సర్పంచ్ దంపతులు శ్రీరామనవమి కళ్యాణంలో కూర్చుంటారు. ఈ సంవత్సరం గ్రామ సర్పంచ్ పూజలో కూర్చోలి కానీ వారికి అనుకూలించలేకపోవడంతో వారికి బదులు గ్రామ వార్డు సభ్యులు మల్లరపు రమేష్ దంపతులు కూర్చుంటామని చెప్పడంతో పూజ ఖర్చు కూడా భరించాలని గ్రామ వీడిసి కమిటీ చెప్పడంతో అంగీకారం జరిగిందన్నారు. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో కూర్చుంటానని చెప్పడం జరిగిందని, దళిత వార్డు సభ్యుడని గ్రామానికి చెందిన వీడిసి కలుపుకొని మాట్లాడి దళితులను శ్రీరామనవమి పూజలో కూర్చోవద్దని వారికి తెలియకుండానే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం పూర్తి చేశారనీ అన్నారు. అంతే కాకుండా దళితులు మేము చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు వినకపోతే పదివేల జరిమానా విధిస్తామని ఆంక్షలు విధించారని తెలిపారు. దళితుల వ్యవసాయ కోతలకు వరి కోత మిషన్ కూడా పంపమని, భూమి దున్నే దానికి టాక్టర్లు కూడా పంపమని, దళితులను ఎలాంటి పనులకు కూడా గ్రామంలో చెప్పొద్దని వీడిసి తీర్మానం చేసిందని అన్నారు. రత్నగిరి పల్లి విడిసి పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రత్నగిరి పల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మల్లరపు రమేష్, సంకపల్లి శ్రీకాంత్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గైని రాజు ఉపాధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. లేకపోతే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేస్తామని తెలిపారు.
