27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సావిత్రిబాయి పూలే అంటే ఒక చరిత్ర

Must read

📰 Generate e-Paper Clip

 

… జిల్లా కేంద్రంలో సావిత్రి బాయి పూలే విగ్రహవిష్కరణ

 నిజామాబాద్, బతుకమ్మ :

దేశంలో వెనుకబడిన తరగతుల వారిని, అట్టడుగున ఉన్న నిమ్న జాతుల వారిని మేలుకొల్పిన మహత్మ జ్యోతి బాపూలే అడుగు జాడల్లో నడిచి రెండు వందల ఏళ్ల క్రితం చదువుల తల్లిగా ప్రసిద్ధి కెక్కిన సావిత్రిబాయి పూలే అంటే ఒక చరిత్ర అని వక్తలు అన్నారు. నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్ లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం పీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా లు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. సావిత్రిబాయి పూలే విగ్రహవిష్కరణ కార్యక్రమానికి సమన్వయకర్తగా నరాల రత్నాకర్ వ్యవహరించి సభను నిర్వహించారు.. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

 

 

Savitribai Phule is a history ఈ సంధర్బంగా  పీసీసీ చీఫ్ మాట్లాడుతూ….దేశంలో మహిళా విద్యకు పునాది వేసింది సావిత్రిబాయి పూలే అని సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం తోనే మహిళలకు సాధికారత లభిస్తుందని అన్నారు. జనవరి 3 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తాం  అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కట్టుబడిందని 42% బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతాం అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి బిజెపి అడ్డుకుంటుందని, బీసీ ప్రధాని ఉన్న బీసీ బిల్లుకు న్యాయం జరగడం లేదు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 86% సర్పంచ్ లుగా గెలవడం బడుగుల లో వస్తున్న చైతన్యకి నిదర్శనం  అన్నారు. జిల్లా నుండి బలమైన బీసీ నేతలుగా ఎదిగిన  డి శ్రీనివాస్, బాలా గౌడ్ ల వారసత్వాన్ని కాపాడుతామని అన్నారు. బీసీ సంక్షేమ విషయంలో, బీసీ రాజకీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎవరితో రాజీ పడేది లేదని రాహుల్ గాంధీ ఇచ్చిన ఎవరికి ఎంతో వారికంత వాటా నినాదం కాదు అది ఒక ఉద్యమం  అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దొరల గడి అయిన ప్రగతి భవన్ పేరు మార్చి మహాత్మ జ్యోతిబాపూలే గా పేరు పెట్టారని గుర్తు చేశారు.  రాష్ట్రంలో మొదటిసారి బీసీ కుల గణ చేసి బీసీ జనాభా 56 శాతం ఉందని అధికారికంగా వెల్లడించారు  అన్నారు.

Savitribai Phule is a history

బీసీల రాజకీయ చైతన్యం పెరిగింది … ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ…

మేజర్ గ్రామపంచాయతీ జనరల్ స్థానంలో కూడా బీసీలు సర్పంచులుగా అధిక శాతంలో గెలిచారు .మైనారిటీలు బీసీలు ఐక్యమత్యంతో ఉండి రాజకీయంగా ఎదగాలని షబ్బీర్ ఆలీ అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలు ఎక్కువగా పోటీ చేసి అధిక సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా రాణించాలి. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ నా ఇంట్లోనే రూపుదిద్దుకోవడం అదృష్టంగా భావిస్తున్న అన్నారు. అసెంబ్లీలో రెండు బిల్లులు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి నెలలు గడుస్తున్న వాటికి ఆమోదం తెలుపకుండా బిజెపి బీసీలకు అన్యాయం చేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

Savitribai Phule is a history

బిసీల పట్ల బిజెపి ఎప్పుడు సానుకూలంగానే ఉంది… అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

బీసీల పట్ల బిజెపి ఎప్పుడు సానుకూలంగా ఉంటుందని ఈరోజు దేశ ప్రధాని ఒక బీసీ బిడ్డని అని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే బిజెపి మద్దతు పలికిందని గుర్తు చేశారు. నిజామాబాద్ లో బీసీ చైతన్యం చాలా ఉంది… రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు నిజామాబాద్ చుక్కాని లాగా ఉందని అన్నారు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.

సావిత్రిబాయి పూలే జీవితమే ఒక సందేశం …బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

సావిత్రిబాయి పూలే చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాలంటే పాఠ్యపుస్తకాల్లో ఆమె జీవిత చరిత్ర చేర్చాలి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.  సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు రాష్ట్ర అధికారిక పండుగ గా నిర్వహించాలి.42% రిజర్వేషన్ సాధన కోసం సీఎం నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని కలవాలి .42 శాతం రిజర్వేషన్ సాధన ఎజెండా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పోరాడాలి. బిసి రిజర్వేషన్ లపై కేంద్రంతో పోరాటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం 42% నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిందే అన్నారు.  రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నిధులు కేటాయించి, ప్రభుత్వ కాంట్రాక్టులో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి  అని కోరారు. బీసీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Savitribai Phule is a history

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సి ఆకుల లలిత, నుడా చైర్మన్ కేశవ వేణు, డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, వ్యవసాయ కమిషన్ మెంబర్, గడుగు గంగాధర్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరాల సుధాకర్ ఆకుల ప్రసాద్ దర్శనం దేవేందర్ కరిపె రవీందర్, మాడ వేడి వినోద్ కుమార్, శ్రీలత, బగ్గలి అజయ్, కోడూరు స్వామి, పొదిలి శోభ, సాయి బసవ, గోపాలకృష్ణ, రమణ స్వామి, దాదాపు 30 బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

 

More articles

Latest article