24 C
Hyderabad
Sunday, August 2, 2026

సెపక్ తక్రా రాష్ట్ర జట్టుకు సాత్విక్, భవిక్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సెపక్ తక్రా సబ్ జూనియర్ రాష్ట్ర జట్టుకు జిల్లాకు చెందిన సాత్విక్, భవిక్ ఎంపికైనట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదారి సంజీవ్ రెడ్డి సోమవారం తెలిపారు. హైదరాబాద్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించిన ఓపెన్ ఎంపికలో సాత్విక్, భవిక్ ఉత్తమ ప్రతిభ కనబర్చారని, కేరళ రాష్ర్టంలో నిర్వహించనున్న టోర్నీలో పాల్గొంటారన్నారు. ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, ఉపాధ్యక్షుడు ల్యాబ్ గంగారెడ్డి, దీపిక, సతీశ్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి, కోచ్ చామకూర బాగారెడ్డి, సామ ప్రతాప్, మీసాల ప్రశాంత్ కుమార్ తదితరులు అభినందించారు.

More articles

Latest article