సర్పంచులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి

  . . . ఎంపీడీఓ బి. శ్రీనివాస్   జుక్కల్, బతుకమ్మ :   గ్రామపంచాయతీల సామర్థ్యాన్ని పెంపొందించడం, గ్రామాల సమగ్ర అభివృద్ధిపై చర్చించేందుకు జులై 28న జుక్కల్ ఎంపీపీ సమావేశ మందిరంలో ప్రత్యేక మండలస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. జడ్పీ సీఈఓ, జుక్కల్ మండల ప్రత్యేక అధికారి చందర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో గ్రామపంచాయతీల అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యాల పెంపు, ప్రభుత్వ అభివృద్ధి...