నాళేశ్వర్, బతుకమ్మ :
నాళేశ్వర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను సోమవారం సర్పంచ్ ఆర్ముర్ లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నాళేశ్వర్ గ్రామానికి 48 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు కావడం జరిగిందన్నారు. అవన్ని చివరి దశలో పూర్తి కావడానికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆర్ముర్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, వార్డు సభ్యులు నవిన్, గణేష్,అనిల్, రాజు, కిషన్, కాంగ్రేస్ నాయకులు రాజన్న సంపత్, హన్మండ్లు, పోతన్న, నవిన్, సేక్రేటరి ఆఖీల్, కారోబార్ భుజంగ్ రావు ఉన్నారు.

