27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ మచ్కురి రమేష్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ.. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్య రక్షణ కోసం మజ్జిగ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వేసవి కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కళ్యాణ్, వార్డు మెంబర్లు జల్ల సాయిలు, కుర్మరాజు, బెగరి గోపి, సావిత్రి, పద్మ, జ్యోతి, మంజుల, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, గ్రామ పెద్దలు,  ఉపాధి హామీ కూలీలు,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article