25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కేజీబీవీ పాఠశాల విద్యార్థినులను అభినందించిన సర్పంచ్…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో రుద్రూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన సందర్బంగా సోమవారం రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ విద్యార్థులను అభినందించి సన్మానించారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇలాంటి ఉన్నత మార్కులు సాధించడం చాలా గొప్ప విషయమని, ఇందుకు కృషి చేసిన కేజీబీవీ విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయునీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ ప్రధానోపాధ్యాయురాలు శ్యామల, ఉప సర్పంచ్ నిస్సార్, వార్డ్ సభ్యులు పోశెట్టి, ఆమంద్ వెంకటేష్, నరేష్, పార్వతి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article