కేజీబీవీ పాఠశాల విద్యార్థినులను అభినందించిన సర్పంచ్…
రుద్రూర్, బతుకమ్మ : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో రుద్రూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన సందర్బంగా సోమవారం రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ విద్యార్థులను అభినందించి సన్మానించారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇలాంటి ఉన్నత మార్కులు సాధించడం చాలా గొప్ప విషయమని, ఇందుకు కృషి చేసిన కేజీబీవీ విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయునీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో...