హైదరాబాద్, బతుకమ్మ : ఘనంగా మన్సూరాబాద్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు వారి నివాసం సెంట్రల్ బ్యాంక్ కాలనీ యందు జరిగాయి.జక్కిడి రఘువీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా భీమా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తలసేమియా పిల్లల కోసం సతీష్,రవి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి 41 యూనిట్స్ బ్లడ్ సేకరించారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, స్పందన పాలాది పాపయ్య పరమేశ్వర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ,భోజనాన్ని ఏర్పాటు చేశారు.మన్సూరాబాద్ బిఆర్ఎస్ వి అధ్యక్షుడు సాయి గౌడ్, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 319 విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ చేశారు.డివిజన్ ,బిఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడు శివ శంకర్ రెడ్డి,జనరల్ సెక్రటరీ పాతూరి త్రిలోక్ గౌడ్, అమ్మ చేయూత ఫౌండేషన్ లో ఉంటున్న వికలాంగులకు భోజనం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.సతీష్, దుర్గా రావు కలిసి ,జిహెచ్ఎంసి మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాలలో డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీష్ యాదవ్, సీనియర్ నాయకులు రుద్ర యాదగిరి, నర్రి వెంకన్న, అనిల్ కుమార్, చంద్రా రెడ్డి, కోదండ సురేష్, నరసింహ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నాగార్జున,నియోజకవర్గ పరిది సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు,కార్యకర్తలు,కాలనీ సంక్షేమ సంఘం నాయకులు,డివిజన్ ప్రజలు, మిత్రులు, అభిమానులు,యువత,శ్రేయోభిలాషులు భారీ ఎత్తున తరలివచ్చి రఘువీర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

