25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తహసీల్దార్లకు ఇసుక తంటా

Must read

📰 Generate e-Paper Clip

  • పాయింట్ ఇవ్వాలంటే లీవ్ లో వెళ్తున్న తహసీల్దార్లు
  • పరేషాన్ లో ధరణి రిజిస్ట్రేషన్ దారులు

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఉన్నత స్థాయి ఉద్యోగం, విలాసవంతంగా బ్రతికే అవకాశం ఉన్న కూడా చేస్తున్న ఉద్యోగంలో వస్తున్న ఒత్తిళ్ల కారణంగా ప్రశాంతత కరువై బాల్కొండ నియోజకవర్గంలోని తహసీల్దార్లు  తలలు పట్టుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా తహసీల్దార్ల బదిలీ, లేదంటే లీవ్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి దాపురించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. పేరుకు ఇసుక పాయింట్ అని అనుమతిస్తే అధికార గణం అండదండలతో బాల్కొండ నియోజకవర్గం లోని పెద్ద వాగు పరివాహక గ్రామాల్లోనడుస్తున్నయథేచ్ఛ ఇసుక అక్రమ రవాణా తహసీల్దార్ల ప్రాణ సంకటంగా మారింది.

పట్టుమంటే కప్పకు కోపం వదులు మంటే పాముకు కోపం.. అన్న చందంగా తహసీల్దార్ల పరిస్థితి మారింది. ఒత్తిళ్లకు తట్టుకోలేక ఇసుక పాయింట్ కు అనుమతి ఇచ్చినన్ని రోజులు తహసీల్దార్లు లీవ్ పెట్టుకొని వెళ్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించని అధికారులకు తెల్లవారితే బదిలీ యే మరి.  జిల్లాలో మరెక్కడా లేని విధంగా అధికార పార్టీలో ఇసుక, మొరం దందాలు చిచ్చు  పెట్టాయి. బాల్కొండ నియోజరవర్గంపై ఈరవత్రి అనిల్, మానాల  మోహన్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు ప్రాతినధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం ఒక్కటి లీడర్లు నలుగురు కాగా ముగ్గురు మాత్రం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వెనుక ముగ్గురు నేతల  అభయ హస్తం ఉందనేది అందరికీ తెలిసిందే. అక్కద విధి నిర్వహణ పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ శాఖకు కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో అధికార పార్టీ  నాయకుల  మధ్య ఉన్న వివాదాలు జై  భీం.. జై బాపు.. జై సంవిధాన్ కార్యక్రకమంలోనే బట్టబయలయ్యాయి. ఏకంగా సోషల్ మీడియా పోస్టులు కేసుల వరకు తీసుకెళ్లాయి. సందట్లో సడేమియా లాగా ఆ ప్రభావం రెవెన్యూ అధికారులు మేము విధులు నిర్వహించలేం మొర్రో అని లాంగ్ లీవ్ బాట పడుతున్నారు.

మోర్తాడ్ మండలంలో గతంలో ఇసుక వ్యవహారం పై వార్త పత్రికలలో వరుస కథనాలు రావడంతో అక్కడి తహసీల్దార్  బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందటే ఏర్గట్ల మండలంలో ఇసుక రవాణా ప్రారంభం కాగానే అక్కడి తహసీల్దార్ సైతం బదిలీపై వెళ్లారు. ఇవి ఇలా ఉండగా వారం రోజుల్లో మెండోరా మండలంలోఇసుక రవాణా ప్రారంభం కాగానే అక్కడున్న తహసీల్దార్ సెలవు పై వెళ్లారు. దాంతో పక్క మండలానికి చెందిన డుప్యూటీ తహసీల్దార్ కు ఇన్చార్జీ తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకొనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇలా ఎప్పుడు చూసిన అధికారులు పదేపదే బదిలీపై వెళ్లడం, సెలవులు పెట్టడం కారణంగా తహసీల్దార్ ఆఫీసులల్లో ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ అవ్వడం మూలాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో నియోజకవర్గ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. మండలంలో ఏదో ఒక చోట ఇసుక పాయింటు నదుస్తుంది అంటే ఆరోజు అధికారులు దాదాపుగా సెలవులలో ఉంటున్నట్లే నని..  దీంతో ధరణిలో భూమి రిజిస్ట్రేషన్ చేయించు కోవడానికి ఇబ్బందిగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More articles

Latest article