తహసీల్దార్లకు ఇసుక తంటా
పాయింట్ ఇవ్వాలంటే లీవ్ లో వెళ్తున్న తహసీల్దార్లు పరేషాన్ లో ధరణి రిజిస్ట్రేషన్ దారులు నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఉన్నత స్థాయి ఉద్యోగం, విలాసవంతంగా బ్రతికే అవకాశం ఉన్న కూడా చేస్తున్న ఉద్యోగంలో వస్తున్న ఒత్తిళ్ల కారణంగా ప్రశాంతత కరువై బాల్కొండ నియోజకవర్గంలోని తహసీల్దార్లు తలలు పట్టుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా తహసీల్దార్ల బదిలీ, లేదంటే లీవ్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి దాపురించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. పేరుకు ఇసుక పాయింట్ అని అనుమతిస్తే అధికార...