. . . మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సోమవారం హైదరాబాదులోని సచివాలయంలో కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, నాందేవాడ వంతెన ( ఆర్ వోబీ) పొడిగింపు (అదనపు పనులు) చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రధానంగా ఈ రైల్వే లైను దాటడానికి విజయ్ థియేటర్, నాందేవాడ వంతెన వద్ద కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ఈ నేపథ్యంలో సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మరొక రైల్వే రన్వే ఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం రూ.170 కోట్లు మంజూరు కావాలన్నారు. అలాగే నిజామాబాద్ లోని రేడియో స్టేషన్ నుంచి ముదక్ పల్లి పాత జిపి ఆఫీస్ వరకు రూ.30 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్డు కోసం ప్రతిపాదించడం జరిగింది. అలాగే వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయి, భీంగల్ మీదుగా కమ్మర్ పల్లి వరకు 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను అందజేశారు.
