29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ లో రైతు ఆడియో కలకలం

Must read

📰 Generate e-Paper Clip

ధాన్యం కొనుగోలు చేయాలని ఆవేదన

రైతును బాధపెడితే ఏ ప్రభుత్వమూ రాదని శాపనార్థాలు

సోషల్ మీడియాలో పోస్టు చేసిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యం కొనుగోళ్లపై ప్రస్తుత పరిస్థితిని ఎత్తిచూపుతూ భీమ్ గల్ మండలం బాబాపూర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త, రైతు సోషల్ మీడియాలో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. ఈ ఆడియోను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోస్ట్ చేశారు. రైతు పోస్టు చేసిన ఆడియో ఆయన మాటల్లో… ‘‘కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అదీ అడ్లది కాంటా చాలు చేయుమని చెయుమనాల. ఇంకెన్నొద్దుల దాక ఇది. ఇది పెట్రుర్రి పోస్టు. రైతులను బాధపెడితే ఏ పార్టీ రాదు. మన పార్టీ అచ్చింది. రైతులకు ఏది కావాలంటే దానికి మనం ముందుండాల. వడ్లు అచ్చి నెలైతుంది. కాంటా చాలుచేపియుర్రి ఫస్టు’’.   అంటూ కాంగ్రెస్ గ్రూపులోనే పోస్టు చేశాడు. రైతుల పరిస్థితి ఇలా ఉందంటూ రైతు ఆడియోను వేముల ప్రశాంత్ రెడ్డి వైరల్ చేశారు.

More articles

Latest article